ఈ రోజు థియేటర్ లలోకి మ్యాన్లీ స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం మూవీ పై డివైడ్ టాక్ వినిపిస్తోంది, గోపీచంద్ ఎప్పుడూ ఒకతరహా కథలను ఎంపిక చేసుకుంటూ విసుగు తెప్పిస్తున్నాడనే నానుడి ప్రేక్షకులలో ఇంకా ఉంది. అదే తరహాలో ఇప్పుడు రామబాణం సినిమా ఉందని రివ్యూస్ ను బట్టి తెలుస్తోంది. డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేదని తెలిసిపోయింది. కల్తీ ఆహారం మరియు కెమికల్స్ తో ఉండే ఆహరం చుట్టూ తిరిగిన ఈకథలో ఫ్యామిలీ సెంటిమెంట్ ను కలిపి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్షగా నిలవనుందని తెలుస్తోంది. ఇక రిలీజ్ కు ముందు లౌక్యం సినిమాలాగా కామెడీ ఉంటుందని చెప్పినా అందులోనూ సినిమా తేలిపోయింది.
ఇక హీరోయిన్ డింపుల్ హయతీ ఎందుకు ఈ సినిమాలో ఉందో అంతుబట్టని విషయం అని చెప్పాలి. ఇక మొత్తంగా గోపీచంద్ నటన మరియు డైలాగులు కోసం మాత్రమే సినిమాకు వెళ్లడం అంటే కష్టమే. సో మరోసారి గోపీచంద్ కెరీర్ లో ఫెయిల్యూర్ పడింది, ఎన్నో ఆశలు పెట్టుకున్న రామబాణం గురి తప్పింది.