తెలుగులో ఓటీటీ యుద్ధం మొదలయినట్టేనా?

-

కరోనా లాక్డౌన్ వల్ల అందరికీ నష్టం జరిగిన మాట నిజమే. కానీ లాక్డౌన్ వల్ల లాభపడ్డదేవరైనా ఉందంటే అది ఓటీటీ యాజమాన్యాలే. థియేటర్లు మూతబడి సినిమాలు లేకపోవడంతో ఓటీటీ వేదికగా సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఓటీటీల మధ్య గట్టి పోటీ నడిచింది. వందశాతం తెలుగు కంటెంట్ ని అందించే ఆహాకి లాక్డౌన్ లో సబ్ స్క్రయిబర్లు పెరిగారు. అదీగాక ప్రేక్షకులని ఎంగేజ్ చేయడానికి ఆహా చాలా ప్రయత్నాలు చేసింది. దాని ఫలితమే తెలుగులో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.

ఐతే తాజాగా తెలుగులో ఆహాకి పోటీ సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీలో మేజర్ షేర్ సంపాదించుకున్న నెట్ ఫ్లిక్స్ తెలుగులోకి వచ్చేస్తుంది. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ నుండి మొదటి తెలుగు వెబ్ సిరీస్ వచ్చేస్తుంది. పిట్ట కథలు పేరుతో వెబ్ సిరీస్ వస్తుండడంతో నెట్ ఫ్లిక్స్ ఇండియా టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలెట్టింది. తెలుగులోకి వచ్చేస్తున్నాం అని నెట్ ఫ్లిక్స్ ఇండియా ట్వీట్ చేయడంతో, దానికి కౌంటర్ గా ఆహా స్పందించిన తీరు నెటిజన్లను ఆసక్తి కలిగిస్తుంది.

మా దగ్గర చాలా సిరీస్ లు ఉన్నాయి. మేమేమైనా అరుస్తున్నామా అంటూ ఆహా కౌంతర్ వేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చనీయాంశంగా మారింది. రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల మధ్య గట్టి పోటీ ఉండనుందని తెలుస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news