స్ఫూర్తి: పద్మశ్రీని సొంతం చేసుకున్న తెలుగువాళ్లు…!

-

దేశ అత్యున్నత పురస్కారాలు అయిన పద్మశ్రీ పురస్కారాలని తెలుగు వారు సొంతం చేసుకున్నారు. 102 పద్మశ్రీ అవార్డులని కేంద్రం ప్రకటించగా .. నాలుగింటిని ఏపీ, తెలంగాణకు చెందిన కళాకారులు సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఆ పద్మశ్రీలని సొంతం చేసుకున్న తెలుగువాళ్లు గురించి చూస్తే… ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒకరికి కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వీటిని ఇవ్వడం జరిగింది. ఏపీకి చెందిన ప్రముఖ కర్నాటక వయొలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామిని పద్మశ్రీ అవార్డు వరించింది. కళా రంగం తరపున ఈయనకి ఈ అవార్డు దక్కింది. అలానే కళా రంగానికి చెందిన నిడుమోలు సుమతి కి కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. కళా రంగం లో మృదంగ కళాకారిణిగా సేవలందిస్తున్న ఈమెకి పద్మశ్రీ తో కేంద్రం సత్కరించింది.

అలానే అనంతపురం జిల్లాకు చెందిన అవధాని డాక్టర్‌ ఆశావాది ప్రకాశ్‌రావును పద్మ శ్రీ అవార్డుకి ఎంపికయ్యారు. ఈయన సీనియర్‌ సాహితీవేత్త కూడా. గతం లో ప్రిన్సిపాల్ ‌గానూ పనిచేశారు. అలానే తెలంగాణ కి చెందిన ప్రముఖ గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇలా పద్మశ్రీ దక్కించుకోవడం… వాళ్ళ సేవలు… వాళ్ళ గొప్పతనం… పడిన శ్రమ.. ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news