పెట్రోల్ ధరలు బాగా పెరిగి పోయాయి. దీనితో వాహనదారులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పెట్రోల్ ధర ఏకంగా రూ.100 దాటేసింది. అయితే పెట్రోల్ ధరలు ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… దేశం లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అలానే అధిక పన్నులు ఇందుకు కారణం. ఎక్సైజ్ సుంకం, వ్యాట్, డీలర్ కమిషన్, రవాణా చార్జీలు ఇలా ఇవ్వన్నీ కలిసి పెట్రోల్ ధర పెరుగుదలకు కారణంగా ఉన్నాయి.
ఏది ఏమైనా వాహదారులకి చుక్కలు కనపడుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా ధర పెరిగి పోయింది. పెట్రోల్ ధర కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకువెళ్తోంది. ఇది ఇలా ఉండగా డీజిల్ ధర కూడా ఇదే దారిలో సాగుతోంది. దీనితో వాహనదారులకు కష్టంగానే ఉంది. దేశంలో కొన్ని చోట్ల పెట్రోల్ ధర బాగా పెరిగిపోయింది… ఆ వివరాలని చూస్తే..
రాజస్థాన్ లోని శ్రీ గంగా నగర్ లో ఎక్స్‌ట్రా ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.100 దాటేసింది. ఇది ఇలా ఉండగా సాధారణ పెట్రోల్ ధర లీటరుకు రూ.97.73 వద్ద ఉంది. ప్రీమియం పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటేయడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. అలానే హైదరాబాద్ లో ఈరోజు పెట్రోల్ ధర 36 పైసలు పెరిగింది. రూ.89.51కు చేరింది. డీజిల్ ధర 39 పైసలు పెరుగుదలతో రూ.83.19కు ఎగసింది. అమరావతి లో రూ.92.29కు చేరింది. విజయవాడలో పెట్రోల్ ధర 91.82 గా ఉంది.