మహారాష్ట్రలో రోజురోజుకు ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. సామాన్యులు సెలబ్రెటీలు అనే తేడా లేకుండా ఈ మహమ్మారి వైరస్ అందరిపై పంజా విసురుతుంది తెర వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు పోలీసులపై ఈ మహమ్మారి వైరస్ పగబట్టి నట్లుగానే పంజా విసురుతున్న విషయం తెలిసిందే.
ఇటీవలే మరో మహారాష్ట్ర మంత్రి కరోనా వైరస్ బారిన పడడం కలకలం సృష్టించింది. శివసేన నేత పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇటీవలే కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. హోం క్వారంటైన్ లో ఉన్న ఆయన తనకు సన్నిహితంగా ఉన్న వాళ్లు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.