pro kabaddi : తెలుగు టైటాన్స్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న.. వ‌రుస‌గా ఎనిమిదో ఓట‌మి

-

బెంగ‌ళూర్ వేదిక‌గా ఈ ఏడాది ప్రొ క‌బ‌డ్డి లీగ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా ప్రొ క‌బ‌డ్డి లీగ్ లో తెలుగు టైటాన్స్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంది. సోమ‌వారం బెంగాల్ వారియ‌ర్స్ జ‌ట్టు తో జ‌రిగిన మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ మ‌రో సారి ఓట‌మి పాలైంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 10 మ్యాచ్ లు ఆడిన తెలుగు టైటాన్స్ జ‌ట్టు వ‌రుస‌గా ఎనిమిది మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది. రెండు మ్యాచ్ లు టై గా ముగిసాయి.

అంటే ఈ సారి జ‌రుగుతున్న ప్రొ క‌బ‌డ్డి లీగ్ లో తెలుగు టైటాన్స్ ఒక్క విజ‌యాన్ని కూడా న‌మోదు చేయ‌లేదు. త‌మిళ్ త‌లైవాస్, బెంగ‌ళూర్ బూల్స్ జ‌ట్ల‌తో జ‌రిగిన మ్యాచ్ ల‌లో మాత్ర‌మే డ్రా గా ముగిసాయి. మిగితా అన్ని మ్యాచ్ ల‌లో తెలుగు టైటాన్స్ ఓట‌మి పాలైంది. దీంతో ప్రొ క‌బ‌డ్డీ 2022 లీగ్ లోని పాయింట్ల ప‌ట్టీక‌లో తెలుగు టైటాన్స్ 12 పాయింట్ల‌తో ప్ర‌స్తుతం చివ‌రి స్థానంలో ఉంది. కాగ బెంగళూర్ బుల్స్ జట్టు 39 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉంది. అలాగే రెండో స్తానంలో పాట్నా జ‌ట్టు 39 పాయింట్ల‌తోనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news