హిందువులలో ప్రధానంగా భావించే యాత్రలో అమర్‌నాథ్ ఆలయ యాత్ర కూడా ఒకటి. ప్రతి సంవత్సరం అనేక వేల మంది భక్తిశ్రద్ధలతో అమర్‌నాథ్ యాత్రను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా నేటి నుండి మొదలవ్వాల్సి న అమర్‌నాథ్ యాత్ర మాత్రం రద్దయింది. కరోనా వైరస్ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి ఆగస్టు 3 వరకు అమర్‌నాథ్ యాత్రను కొనసాగించాలని మొదటి నిర్ణయం తీసుకున్నా, చివరి నిమిషంలో మాత్రం ఈ యాత్రను రద్దు చేసింది దేవస్థానం బోర్డు.
అయితే మూడు రోజుల క్రితమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా అమర్‌నాథ్ వెళ్లి మంచు శివలింగానికి పూజలు నిర్వహించారు. దీనితో ఎటువంటి అడ్డంకులు ఉండబోవని భావించిన భక్తులకు మాత్రం చివరికి నిరాశే మిగిలింది. అయితే కరోనా మహమ్మారి ఎక్కువవుతున్న నేపథ్యంలో అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.