నిన్నటి రోజున పసిడి పరుగులు పెట్టిన బంగారు ధర నేడు వెలవెలబోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరిగినప్పటికీ, దేశీయ మార్కెట్లు మాత్రం బంగారు ధరలు తగ్గడం నిజంగా గమనార్హం. ఓవైపు బంగారం ధర తగ్గగా… వెండి మాత్రం పైపైకి ఎగిసి పడింది. నేడు హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 90 తగ్గి రూ.51,240 కు చేరుకుంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గి రూ. 46,950 కు చేరుకుంది.
పసిడి విలువ కాస్త తగ్గినా వెండి ధర మాత్రం ఎగిసింది. కిలో వెండి ధర రూ. 240 కు పెరిగి రూ.53,150 కు చేరుకుంది. ఇందుకు ప్రధాన కారణం నాణ్యాలు తయారు చేసేందుకు పరిశ్రమ యూనిట్ల నుండి డిమాండ్ ఎక్కువ అవ్వడంతో కాస్త పెరిగింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ కు 0.06 శాతం పెరిగి 1818 డాలర్లకు చేరుకుంది. అలాగే వెండి ధర కూడా 0.75 శాతం పెరిగి 20.34 డాలర్లకు చేరుకుంది.