పది అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సౌత్ ఈస్టర్న్ రైల్వే లో ప‌లు అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ని విడుదల చేయడం జరిగింది. దీనిలో మొత్తం 1785 అప్రెంటీస్ ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఈ పోస్టులకి అప్లై చెయ్యాల్సి ఉంటుంది. ఇక వయస్సు విషయానికి వస్తే.. అప్రెంటిస్ పోస్టులకు కనీస వయస్సు 15 సంవత్సరాలు ఉండాలి. మాక్సిమం అయితే 24 సంవత్సరాలు ఉండాలి. అలానే గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ చ‌దివి ఉండాలి. ఐటీఐ స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాలి. వివిధ రకాల పోస్టులు వున్నాయి. నోటిఫికేషన్ లో వాటి వివరాలని చూడచ్చు.

ఈ అప్రెంటీస్ ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 14, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. అభ్య‌ర్థుల అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేసి సర్టిఫికెట్స్ చూసి ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ స‌మాచారం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ rrcser.co.in ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది చూస్తే..

ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://rrcser.co.in ను ఓపెన్ చేసి వివరాలని చూడచ్చు.
త‌రువాత అప్లికేష‌న్ లింక్ https://appr-recruit.co.in/2021-22Aprt/gen_instructions_ser.aspx లోకి వెళ్లాలి.
New Registration ఆప్ష‌న్ క్లిక్‌చేసి ద‌ర‌ఖాస్తులోకి వెళ్లాలి.
అప్లికేషన్ ని నింపాలి.
ప‌రీక్ష ఫీజు రూ.100 చెల్లించి ద‌ర‌ఖాస్తు ప‌క్రియ‌ను ముగించాలి.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

 

Read more RELATED
Recommended to you

Latest news