నాలుగు రోజులుగా డీజీపీ మహేందర్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మకాం వేశారు. ఒక పక్క మావోయిస్టుల కోసం పోలీస్ కూంబింగ్ కొనసాగుతుండడం ఇక్కడే డీజీపీ ఉండడంతో ఉమ్మడి జిల్లా అడవుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండో తేదీ నుంచి ఆసిఫాబాద్ లోనే ఉంటున్నారు డీజీపీ.
నిన్న రాత్రి మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉండే తిర్యాణి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలీస్ బాస్. అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచనలు చేశారు. ఇక మరో పక్క మావోల కోసం తిర్యాణి-మంగి, కవ్వాల్ అభయారణ్యనాన్ని జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఏజెన్సీ మండలాలతో పాటు ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ జరుగుతోంది. డీజీపీతో పాటు నార్త్ జోన్ ఐజి నాగిరెడ్డి ఈ కూంబింగ్ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు,