భారత్ లో కరోనా ఉగ్రరూపం.. రికార్డు స్థాయిలో కేసులు..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 86,432 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1,089 మంది మరణించారు.

coronavirus
 

దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 40,23,180 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 69,561 కి పెరిగింది. నిన్న 70,072 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 31,07,223 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,46,395 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,59,346  పరీక్షలు చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో సెప్టెంబ‌ర్ 3 వ‌ర‌కు మొత్తం 4,77,38,491 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని ICMR వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news