సరిహద్దుల్లో ఉగ్రవాదులకు అవకాశం దొరికిందా…?

-

దేశంలోకి రావడానికి ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో భారత ఆర్మీ ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే భారత బలగాలను ఏమార్చి వాళ్ళు అడుగు పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో కరోనా వైరస్ ఉన్న నేపధ్యంలో పోలీసులు ఆర్మీ కూడా కరోనా మీద దృష్టి పెట్టింది. సరిహద్దుల్లో సమస్య లేదు అనుకున్న ప్రాంతాల్లో భద్రత తగ్గించారు.

ఇప్పుడు ఆ ప్రాంతాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు సమాచారం. నిఘా వర్గాల కళ్ళు గప్పి తమకు ఉన్న మార్గాల ద్వారా ఉగ్రవాదులు దేశంలోకి అడుగు పెట్టే మార్గాల కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే భారత ఆర్మీ చాలా అప్రమత్తమైంది. సరిహద్దుల్లో భద్రతను పెంచే ఆలోచన చేస్తున్నారు రక్షణ శాఖ అధికారులు. ఏ మాత్రం కూడా లైట్ తీసుకోవద్దని, అదనపు బలగాలను మోహరించాలని,

కేంద్ర రక్షణ శాఖ కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనితో నిఘా వర్గాలు కూడా ఇప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇక స్థానిక పోలీసులు ఎక్కువగా లాక్ డౌన్ విధుల్లో ఉన్నారు. వారిని ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. తాజాగా జరిగిన కాల్పుల్లో పది మంది ఉగ్రవాదులను కాల్చి చంపింది మన ఆర్మీ.

Read more RELATED
Recommended to you

Latest news