“తగ్గేదేలే” మూవీ రివ్యూ : లవ్ & మర్డర్, మిస్ట్రీ

-

నవీన్ చంద్ర, రవిశంకర్, దివ్య పిల్లై ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా తగ్గేదేలే. దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన దండుపాళ్యం సినిమా కన్నడ తో పాటు తెలుగులో కమర్షియల్ హిట్ గా నిలిచింది. దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాస రాజు దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం తగ్గేదేలే. నవీన్ చంద్ర, దివ్య పిల్లై, అనన్య రాజ్, రవిశంకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. టీజర్, ట్రైలర్స్ లో దండుపాళ్యం బ్యాచ్ కనిపించడంతోపాటు డిఫరెంట్ టైటిల్ తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

 

కథ మరియు వివరణ
ఈ సినిమా మర్డర్ మిస్ట్రీ, డ్రగ్స్, లవ్ వంటి మూడు కథలతో సాగుతుంది. ఈశ్వర్ (నవీన్ చంద్ర) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మేనత్త కుమార్తె దేవి (దివ్యా పిళ్ళై)ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో లిజి (అనన్యా సేన్ గుప్తా)ను చూసి ఈశ్వర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత తాను ఈశ్వర్ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న లిజి ఈశ్వర్ ఇంట్లో ఉంటూ… అంతకుముందు తనతో దిగిన ఫొటోలతో ఈశ్వర్‌ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలు లిజి తో ఈశ్వర్ కు ఎలా పరిచయం ఏర్పడింది,,వారిద్దరి మధ్య ఉన్న కథ ఏమిటి? ఈశ్వర్ సంబందించిన వీడియోస్ లిజి దగ్గరకు ఎలా వచ్చాయి అని ఆలోచిస్తున్న ఈశ్వర్ కు తన ఇంటిలో లభించిన మహిళ శవం దొరుకుతుంది. అప్పటివరకు దండుపాళ్యం బ్యాచ్ తో సంబంధం ఉందని అనుమానం పడుతున్న పోలీసులకు ఈశ్వర్ ఇంట్లో అమ్మాయి శవం దొరకడం తో ఆ అమ్మాయిని ఈశ్వర్ చంపాడనే అనుమానంతో పోలీస్ ఆఫీసర్ చలపతి(రవి శంకర్), రాజా రవీంద్ర ఇంటరాగేషన్ చెయ్యాలని అరెస్ట్ చేస్తారు.ఈ ఇంటరాగేషన్ లో ద్వారా ఈశ్వర్ ద్వారా తెలుసుకున్న నిజాలు ఏమిటి?ఆ అమ్మాయిని ఎవరు హత్య చేశారు? ఆ హత్య నుండి తను ఎలా బయట పడ్డాడు? ఈశ్వర్ జీవితానికి, దండుపాళ్యం గ్యాంగుకు, డ్రగ్స్ మాఫియాకు ఉన్న సంబంధం ఏమిటి? పోలీస్ ఆఫీసర్ చలపతి (రవి శంకర్) దండుపాళ్యం గ్యాంగ్ ను, డ్రగ్ మాఫియాను ఏం చేశాడు ? అనేది తెలుసు కోవాలంటే తగ్గేదేలే సినిమా తప్పక చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్రలో నవీన్ చంద్ర .నవీన్ చంద్ర భార్య గా దివ్యా పిళ్ళై ట్రెడిషనల్ వైఫ్‌ పాత్రలో చక్కగా నటించింది. నవీన్ చంద్ర ప్రియురాలు గా అనన్యా సేన్ గుప్తా గ్లామర్ డాల్‌గా కనిపించారు. భార్యకు, ప్రియురాలు మధ్య నలిగిపోయే ఎమోషన్ పాత్రలో నవీన్ చంద్ర ఆకట్టు కున్నాడు. సినిమా ఎక్కువ భాగం నవీన్ చంద్ర చుట్టూ తిరుగుతుంది.చలపతి పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా రవిశంకర్ కూడా తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ‘పోలీస్‌గా రాజా రవీంద్ర,. ‘దండుపాళ్యం’ గ్యాంగ్ సభ్యులుగా మకరంద్ దేశ్‌పాండే, పూజా గాంధీ, రవి కాలె మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.హీరో స్నేహితులు గా ‘గెటప్’ శీను, ‘ఆటో’ రామ్ ప్రసాద్ లు తమ కామెడీ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు.సమరం లాంటి డాక్టర్ సమరం గా ’30 ఇయర్స్’ పృథ్వీ. చాలా బాగా నటించాడు. ఇలా ఈసినిమాకు పని చేసిన వారందరూ తమ నటనతో ఆకట్టుకున్నారు.

ప్లస్ పాయింట్లు:
కథ
స్క్రీన్ ప్లే
సంగీతం
ఎమోషన్ సీన్లు

నటీ నటుల పనితీరు

సినిమా రేటింగ్: 3/5.

Read more RELATED
Recommended to you

Latest news