“భోళాశంకర్” కు జోడీగా తమన్నా..!

-

మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. భోలా శంకర్ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా నటించే హీరోయిన్ పై ముందు నుంచి అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమన్నా పేరు ఎక్కువగా వినిపించింది. తాజాగా సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు తమన్నా దాదాపు ఖరారు అయిందని సమాచారం. సినిమాలో చిరంజీవి కి చెల్లిగా మహానటి కీర్తిసురేష్ నటిస్తోంది.

ఇదిలా ఉంటే తమన్నా.. రామ్ చరణ్ తో కలిసి రచ్చ సినిమా లో హీరోయిన్ గా నటించగా ఇప్పుడు మెగాస్టార్ తో కూడా నటించబోతోంది. ఇక తమన్నా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల మ్యాస్ట్రో సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. అంతే కాకుండా గోపి చంద్ హీరోగా నటిస్తున్న సీటిమార్ సినిమాలో హీరోయిన్ గా నటించింది అలరించింది. మరో మెగా స్టార్ పక్కన తమన్నా ఏ మేరకు అలరిస్తోందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news