థ్యాంక్యూ వెరీమచ్ సీఎం సార్… జగన్ వారి విషయంలో సక్సెస్ అయినట్లే!

-

ఏపార్టీ అధికారంలో ఉన్నా.. ఆ ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందండంలోనూ, ప్రభుత్వానికి సహకరిస్తూ.. ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండే విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగులదే కీలకపాత్ర. వీరిని ఉద్యోగులుగా చూడకుండా.. వారి మనోభావాలకు విలువనివ్వకుండా.. వీరి సంఘం నాయకుడిని అక్కునచేర్చుకుంటే చాలు.. వీరంతా ప్రభుత్వంవైపు, అధికారపార్టీవైపు ఉంటారని గతంలో కొందరు ముఖ్యమంత్రులు భావించడం.. ఫలితంగా దిమ్మతిరిగే దెబ్బలు తినడం తెలిసిందే! ఈ క్రమంలో జగన్ మాత్రం ఆ తప్పు చేయడం లేదు సరికదా… సంక్షేమ పథకాల ద్వారా సామాన్యులపై ఎంతటి శ్రద్ధ పెట్టారో… ప్రభుత్వ ఉద్యోగులపై కూడా అంతే శ్రద్ధ పెట్టామని చెప్పకనే చెబుతున్నారు!

తాజాగా కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం… “ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని.. వారి జీతాలు సకాలానికే అందించాలని” అధికారులను ఆదేశించారు! ఇది శుభపరిణామమనే చెప్పాలి! గత ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో ఎంతటి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందనేది జగమెరిగిన సత్యమే. దీంతో జగన్ ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. పరిస్థితులను అర్ధం చేసుకుంటున్నారు.

ఈ సందర్భంగా మరింతగా మాట్లాడిన జగన్… రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసింది సున్నా అనే విషయాన్ని గుర్తుచేస్తూ… ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జీతాల్లో ఏస్థాయి మార్పులు వచ్చాయనే విషయాన్ని తెలియజేసే పనికి పూనుకున్నారు! ఇందులో భాగంగా… జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019, జూలై నుంచి “మినిమం టైం స్కేల్”‌ అమలు చేస్తున్నట్లు ఈ సమావేశం పేర్కొంది. దీని ఫలితంగా… దీని ఫలితంగా..మార్చి 31, 2017 ఉన్న జీతాలు.. జులై, 2019 నాటికి 88 శాతం నుంచి 95 శాతం వరకు పెరిగాయి.

దీంతో… ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల మనసు జగన్ దోచుకున్నట్లయ్యిందని కామెంట్లు వినిపిస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news