ఆ 21 గ్రామాల వారందరికీ రెండేసి ఓట్లు.. ఎందుకో తెలుసా..?

-

సామాన్యంగా ప్రతి పౌరుడికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. ఇది ఎన్నికల నిబంధన. ఎవరైనా రెండు చోట్ల దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందితే వెంటనే అధికారులు గుర్తించి ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకుంటారు. కానీ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 21 గ్రామాల వారందరికీ అధికారులే రెండేసి ఓట్లు కేటాయించారు.

విజయనగరం నుంచి 60 కిలో మీటర్ల కొండ ప్రాంతాల్లో పర్యటించగా విజయనగరం–కోరాపూట్‌ జిల్లాల మధ్య ఉండే 21 ప్రాంతాలను కొటియా గ్రామాలు అంటారు. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు అవతరించినప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగకపోవడంతో వాటిని ఏ ప్రాంతాల్లో కలపలేదు. ఆ తర్వాత సర్వే కాని గ్రామాలన్నీ తామవంటే తమవని రెండు రాష్ట్రాలు 1968 వాదించుకొని కోర్టు మెట్లు ఎక్కాయి. వాదోపావాదనలు తర్వాత 2006లో పార్లమెంట్‌లో తేల్చుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ఇప్పటికి కూడా ఆ సమస్య తీరనేలేదు.

కొండకు రెండువైపులా..

అక్కడ ఉండేవారంతా గిరిజనులే. కొండకు అటువైపు ఉన్న కొటియా పంచాయతీ సమీపంలోని వారందరూ ఒడిశా వైపు ఆసక్తి కనబరుస్తారు. కొటియా, డొలియాంబ, మడకార్, పురిటిభద్ర, తదితర గ్రామాలు ఒడిశా పరిధిలోకి వెళ్తే, కొండకు ఇటువైపు ఉన్న పొలిపిగూడ, శికపరుగు,నేరేళ్ల వలస, దిగవశెంబి, ఎగువశెంబి, ధూలిభద్ర గ్రామాలు ఆంధ్ర సమీపంలో ఉన్నావి.

అన్నీ రెండే..

ఆ 21 గ్రామస్థులకు రెండేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి. అక్కడ ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ రెండ్రెండు ఉన్నావి. రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డు పింఛన్లు అందరికి రెండు ఉండాల్సిందే. ఎన్నికలు జరిగే ప్రతిసారి వీరు రెండు రాష్ట్రాల్లో ఓటేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news