ఆ పుస్తకం అంత హిట్.. చదివితే ఫిదా అవ్వాల్సిందే..!

-

శాంతారామ్.. ఈ పుస్తకం గురించి ప్రస్తుతం తెలియని వారుండరనే చెప్పుకోవచ్చు. థ్రిల్లింగ్, ఫిలాసఫికల్, ట్రాజెడీ, రొమాంటిక్, ఒకరి జీవితానికి సంబంధించిన ఎత్తుపల్లాలు, కష్టాలను సవివరంగా తెలియజేసే పుస్తకం ఇది. ఈ పుస్తకంలోని పాత్రలు ఒకరికి జరిగిన కథ కాదు.. అలా అని జరగని కథ కాదు. రచయిత తన స్వీయ అనుభవాలను జోడించి కమర్షియల్ ఫార్మాట్ లో రాసిన పుస్తకం ఇది. ఇది ఒకరి బయోగ్రఫీ కాదు.. కేవలం నవల మాత్రమే. కాని ఈ పుస్తకాన్ని చదివినంత సేపు ఆటోబయోగ్రఫీ చదువుతున్న భావనే కలిగిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా మెచ్చిన పుస్తకం ఇది.

శాంతారామ్ పుస్తక రచయిత డేవిడ్ రాబర్ట్ ఎంతో అద్భుతంగా పుస్తకాన్ని రాశారు. కథ ఇలా ప్రారంభం అవుతుంది.. బ్యాంకు రాబర్ డేవిడ్ ఆస్ట్రేలియాలోని పెన్ ట్రిడ్జ్ జైలు నుంచి తప్పించుకుని ఇండియాకు చేరుతాడు. మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలో అతనికి మొదటగా పరిచయమైన వ్యక్తి ప్రభాకర్.. మొదట్లో డేవిడ్ కు సలహాదారుడిగా ఉంటూ ఆ తర్వాత మంచి స్నేహితుడవుతాడు. డేవిడ్ ని లిన్ బాబా అంటూ పిలుచుకుంటాడు. బాంబే అంటే జిలుగు వెలుగులు కాదని.. బాంబేకు మరో కోణం కూడా ఉందని.. బాంబే మురికివాడల జీవితాన్ని ప్రభాకర్ పరిచయం చేయిస్తాడు.

ఆ తర్వాత ప్రభాకర్ డేవిడ్ ను తన స్వగ్రామం సుందర్ కు తీసుకెళ్తాడు. నిరుపేద కుటుంబం అయినా కోట్ల కంటే విలువైన ప్రేమానురాగాలు డేవిడ్ ను ఎంతో ఆకట్టుకుంటాయి. ప్రభాకర్ తల్లి డేవిడ్ కు శాంతారామ్ అని పేరు పెడుతుంది. ఆ పేరు విలువ తెలుసుకున్న తర్వాత ఎంతో మురిసిపోతాడు డేవిడ్. ఆ తర్వాత బాంబేకు తిరుగు ప్రయాణం అవుతారు. ఒక బార్ లో తన డబ్బులతో పాటు పాస్ పోర్టు కూడా పొగొట్టుకుంటారు. ఇక బాంబేనే దిక్కని డేవిడ్ అక్కడ ఉండిపోతాడు.

బాంబేలోని స్లమ్ ఏరియాలో చిన్న షెడ్డు తీసుకుని అందులో కాలం వెల్లదీస్తాడు. అనుకోకుండా ఒకరోజు ఆ ఏరియాలో అగ్నిప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో డేవిడ్ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతాడు. అలా తెలిసిన వైద్యం చేస్తూ అనధికార డాక్టర్ గా కొనసాగుతాడు. ఈ విషయం క్రిమినల్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ కు తెలుస్తుంది. డేవిడ్ తో మంచిగా ఉంటూనే బ్లాక్ మార్కెట్ దందాలో లాగుతాడు. జైలు శిక్షలు అనుభివించడం.. తర్వాత ప్రొఫెషనల్ కిల్లర్ గా డేవిడ్ మారుతాడు.

డేవిడ్ స్నేహితుడు మరణించడంతో ఖాదర్ ‘కార్లా’ అనే అమ్మాయిని పరిచయం చేయిస్తాడు. ఆ అమ్మాయి బాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్నచితకా వేషాలు వేస్తూ బాంబే అండర్ వరల్డ్ క్రిమినల్ ఆపరేషన్లలో ఆమె పావుగా ఉపయోగించుకుంటుంటారు. డేవిడ్ మామూలు జీవితంలోకి వచ్చాక ఖాదర్ తో కలిసి ఆఫ్గనిస్తాన్ ను వెళ్తారు. తీవ్రవాదుల దాడిలో ఖాదర్ హత్యకు గురవుతాడు. దీంతో డేవిడ్ ఇండియాకు వచ్చేస్తాడు. నేరాల బాటను వీడి నిజాయితీగా బతకాలని నిర్ణయించుకుంటాడు. అలా ఈ కథ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news