నా నిర్మాణంలో అదే చివరి చిత్రం.. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ షాకింగ్ కామెంట్స్..!

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతోమంది నటీనటులు, దర్శక నిర్మాతలు తమకంటూ ఒక ప్రత్యేకమైన గోల్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. ఇక ఈ క్రమంలోనే ఎంతోమంది తమ చిరకాల చివరి కోరికను నెరవేర్చుకోవడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి గొప్ప స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ కూడా ఒకరు. ఇక ఈయన తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాకు తన కూతురు స్వప్న దత్ తో కలిసి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా విడుదలయ్యి వారంపైగా అవుతున్నప్పటికీ కూడా.. ఇంకా మొదటి రోజులాగే కలెక్షన్లు సాధిస్తూ ఉండడం గమనార్హం.

ఈ సినిమా సక్సెస్ పురస్కరించుకొని తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్నో విషయాలను పంచుకోవడమే కాకుండా తన చిరకాల కోరికను కూడా ఆలీతో అలాగే ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎన్నో వందల సంఖ్యలో చిత్రాలను తెరకెక్కించిన అశ్విని దత్ తన చివరి సినిమా అదే కావాలి అంటూ తెలిపారు. ఇక అశ్వినీ దత్ బ్యానర్లో తెరకెక్కిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాను రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వినీ దత్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ సినిమా అప్పట్లో ఏ రేంజ్ లో విజయాలను సొంతం చేసుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.Nani narrates the story behind Chiranjeevi and Sridevi's Jagadeka Veerudu Athiloka Sundari | Telugu Movie News - Times of India

ఇంకా కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా సీక్వెల్ చేయాలనేది నా చివరి కోరిక. ఇదే నా నిర్మాణంలో ఆఖరి చిత్రం అంటూ ఆయన వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ చిత్రం చేయాలని ఎప్పటినుంచో ఉంది కానీ ముందుకు సాగలేకపోతుందని వెల్లడించిన ఆయన ఈ సినిమా ఎవరితో చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా ఇక ఆ ప్రోమో లో మాటలు వినపడకుండా కట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news