వైసీపీ డ్యామేజ్‌కు ఆ మంత్రి చాలు!

-

రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసిన నేతకే ప్రజల మద్ధతు ఎక్కువ ఉంటుంది. ఏమైనా హామీలు ఇస్తే వాటిని అమలు చేసి తీరాలి. ఇచ్చిన హామీలని పూర్తిగా అమలు చేయకపోయినా…ఒకవేళ పూర్తిగా అమలు చేయడం కుదరకపోతే దాదాపుగా అమలు చేస్తే సరిపోతుంది. అలాగే కొన్ని హామీలు అమలు కాకపోతే…అవి అమలు చేయలేకపోయామని ప్రజలకు కారణాలతో వివరిస్తే సరిపోతుంది.

అలా కాకుండా ఇచ్చిన మాటని తప్పితే ప్రజలు ఓడించే ఇంట్లో కూర్చుపెడతారు. ఉదాహరణకు చంద్రబాబే ఉన్నారు…2014లో అధికారంలోకి రావడానికి చాలా హామీలు ఇచ్చారు. అందులో ప్రధానమైంది రైతు రుణమాఫీ. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేక వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఇలా పలు హామీలని అమలు చేయలేకపోయారు. దీంతో బాబుని ప్రజలు మరోసారి నమ్మలేదు. ఇక మాట తప్పను, మడమ తిప్పను అంటూ…జగన్ పలు హామీలు ఇచ్చి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు.

అయితే బాబు కంటే బెటర్ గానే ఇచ్చిన హామీలని అమలు చేస్తున్నారు గాని…కొన్ని విషయాల్లో మాట తప్పుతున్నారు…మడమ తిప్పుతున్నారు. ఇక చెప్పిన హామీని..చెప్పినట్లు అమలు చేయడం లేదు. ఏదొక షరతు పెట్టి అమలు చేస్తున్నారు. ఇక జగన్ ఇచ్చిన హామీలని కూడా తాము ఇవ్వలేదని వైసీపీ వాళ్ళు చెప్పడం విడ్డూరంగా ఉంది.

మద్యపాన నిషేధం గురించి జగన్ ఏ స్థాయిలో ప్రచారం చేశారో…సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు…తర్వాత దశల వారి మధ్యపన నిషేధం అన్నారు..కానీ ఏది అమలు చేయలేదు…మద్యపాన నిషేధంలో చేతులెత్తేశారు. ఇక లిక్కర్ ధరలు ఎలా ఉన్నాయో..నాణ్యత లేని లిక్కర్‌ గురించి జనాలకు తెలుసు. అయితే ఆ మధ్య మధ్యపన నిషేధం హామీ తమ మేనిఫెస్టోలో లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ దారుణమైన అబద్ధం ఆడారని ప్రజలు మాట్లాడుకునే పరిస్తితి. తాజాగా వైసీపీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదని, అయినా 90 శాతానికి పైగా పూర్తి చేశామని చెప్పారు.

అంటే ఎన్నికల్లో హామీలు ఇచ్చేది వాటిని అమలు చేయడానికే. మరి మంత్రి గారేమో ఇలా అంటున్నారు. ఇక ఎప్పుడో అధికారంలోకి వచ్చిన మొదట్లో మూడు రాజధానులు అన్నారు…ఇప్పుడేమో ఎన్నికల ముందు మూడు రాజధానులు వచ్చేస్తాయని అంటున్నారు. అసలే వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుదనుకుంటే….కొందరు మంత్రులు మాటల వల్ల ఇంకా డ్యామేజ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news