ఆంధ్ర ప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీనే…కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ముగియడంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ఏ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుంది..? ఆంధ్ర ప్రదేశ్ నెక్ట్స్ ముఖ్యమంత్రి ఎవరూ అవుతారు..? అనే అంశాలపై స్టేట్ పాలిటిక్స్‌లో జోరుగా చర్చ మొదలైంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలో ఏపి రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ఆయన మీడియా మాట్లాడుతూ… ఏపీలో మరోసారి జగన్ గెలుస్తున్నాడని జోస్యం చెప్పారు. ఈ మేరకు తమకు సమాచారం ఉందని ఎమ్మెల్యే కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ నేతృత్వంలోని వైసీపీనే మరోసారి గెలుస్తుందనే కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా కేటీఆర్ కూడా జగన్‌నే గెలుస్తాడని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. మరీ కేసీఆర్, కేటీఆర్ చెప్పింది నిజం అవుతుందో లేదో చూడాలంటే జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news