దేశ భక్తి విషయంలో పేటెంట్ హక్కులు అన్ని భారతీయ జనతా పార్టీవే అని కొన్ని కొన్ని సందర్భాల్లో నిరూపితం అవుతూ ఉంటుంది. దేశాన్ని 60 ఏళ్ళు పాలించి కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకున్న గాంధీ కుటుంబానికి ఏ మాత్రం హక్కులు లేవు అంటారు ప్రధాని నరేంద్ర మోడీ. గాంధిని పొగిడినా, గాడ్సేని పొగిడినా కూడా ఒకటే అంటూ దేశంలో తమదైన పాలనను ప్రజలకు అందిస్తూ ముందుకి సాగుతున్నారు.
అది పక్కన పెడితే, ఇప్పుడు దేశంలో అపరకుబేరుడు, అమెజాన్ సిఈఓ బెజోస్ పర్యటిస్తున్నారు. అయితే ఆయనకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇంకా దొరకలేదు. వాస్తవానికి విదేశాల నుంచి ఎవరైనా వస్తే వెంటనే కలిసే ప్రధాని నరేంద్ర మోడీ బెజోస్ ని మాత్రం కలవలేదు. దానికి కారణం ఏంటి అనేది ఒకసారి చూస్తే, వాషింగ్టన్ పోస్ట్‌లో వరుసగా భారత వ్యతిరేక వార్తలు వస్తున్నాయని మోడీ ఆగ్రహంగా ఉన్నారు.
బెజోస్ దే వాషింగ్టన్ పోస్ట్ కూడా. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం భారత్‌లోని మైనార్టీలు భయభయంగా ఎదురుచూస్తున్నారని వాషింగ్టన్ పోస్ట్ ఒకసారి కథనం రాసింది. అదే విధంగా కాశ్మీర్ లో ప్రజలకు స్వేచ్చ లేదనే వార్తలను కూడా రాసింది. వాస్తవాలకు భిన్నంగా కథనాలు వచ్చాయని మోడీ ఆగ్రహంగా ఉన్నారట. అందుకే ఆయనను మోడీ కలవడం లేదని, ఇప్పటికి మూడు సార్లు ప్రయత్నాలు చేసినా కలవలేదని అంటున్నారు.