తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి జపం చేస్తున్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జిందాబాద్ కొడుతున్నారు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ పార్టీ పొలిటిషన్లు. ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్ మరియు జగన్ సమావేశం అవ్వడం పట్ల టీ కాంగ్రెస్ ముఖ్య నేత పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని ఇక్కడ ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి అబిమానులను ఆకర్షించడానికే ఈ బేటీ జరిగిందని పిసిసి మాజీ అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.
నదుల అనుసంధానంపైనే సమావేశం జరిగి ఉంటే నీటిపారుదల శాఖ కార్యదర్శులు అక్కడ ఎందుకు లేరని ఆయన అన్నారు.. ఉమ్మడి రాష్ట్రంలో.. కృష్ణా బేసిన్ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు 44వేల క్యూసెక్కుల నీటిని తరలించడాన్ని వ్యతిరేకించిన కేసీఆర్‌కు ఇప్పుడు 88 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తామంటున్నా ఎందుకు మాట్లాడడం లేదని పొన్నాల ప్రశ్నించారు.
ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అని అనేసరికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు మాత్రం ఎప్పుడూ వైయస్ గుర్తుకు రావటం ఆశ్చర్యం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు…ఎన్నికలప్పుడే వీళ్లకు వైఎస్ గుర్తుకు వస్తారు తర్వాత మర్చిపోతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.