అందుకే సానియా ను దూరం పెట్టిన షోయబ్..!!

-

భారత టెన్నిస్ స్టార్ అయినా సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎన్నో విమర్శలకు గురైన ఈమె ప్రస్తుతం అతనితో విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2010లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్నప్పుడు పాకిస్తాన్ ఆటగాడితో పెళ్లి ఏంటి అనే విమర్శలు కూడా వచ్చాయి. ఇలా ఒక కొడుకు జన్మించిన తర్వాత 12 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎటువంటి ఆటంకాలు కలగలేదు. కానీ ఉన్నట్టుండి గత కొద్ది రోజుల క్రితం వీరిద్దరి వైవాహిక జీవితానికి తెరపడింది అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య సఖ్యత లేదని.. సంసారం సాఫీగా జరగడం లేదన్న ప్రచారం బాగా జరుగుతుంది. అంతేకాదు నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై వీరిద్దరూ కూడా స్పందించకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే..

ఆమె వల్లే సానియాను షోయబ్ దూరం పెడుతున్నాడు అనే వార్త ప్రస్తుతం మరింత సంచలనం సృష్టిస్తోంది. తాజాగా షోయబ్ మాలిక్.. అయోష ఓమేర్ అనే ఒక మోడల్ తో కలిసి ఫోటోషూట్లో పాల్గొన్నారు. అంతేకాదు అందాల ఆరబోతలో హద్దులు మీరిన వీరిద్దరూ రెచ్చిపోయారు. ఇక ఆమె మాయలో పడిపోయిన షోయబ్.. సానియా మీర్జాతో గొడవలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు షోయబ్.

మొత్తానికి అయితే ఒక మోడల్ వలలో పడి కట్టుకున్న భార్యకే అన్యాయం చేయబోతున్నాడు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. గత కొన్ని నెలలుగా దుబాయిలో సానియా ఉండగా మరోపక్క పాకిస్తాన్లోనే సోయాబ్ మాలిక్ ఉంటున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news