మోదీ టూర్‌..ఏపీ-తెలంగాణల్లో ట్విస్ట్‌లు.!

-

ఎప్పుడూలేని విధంగా ప్రధాని మోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్విస్ట్‌లతో కొనసాగుతుంది. మోదీ టూర్ చుట్టూ ఆసక్తికరంగా రాజకీయం నడుస్తోంది. ప్రస్తుతం మోదీ విశాఖలో ఉన్నారు.. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభిస్తారు. అదే సమయంలో రాజకీయంగా కొత్త కొత్త ట్విస్ట్‌లు వస్తున్నాయి. ఇప్పటికే మోదీ..రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమై..జగన్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

అయితే తమకు బీజేపీ ఆశీస్సులు మెండుగా ఉన్నాయని వైసీపీ నేతలు చెప్పుకొంటున్నారని మోదీకి రాష్ట్ర బీజేపీ నేతలు వివరించారు.     తాను సమాఖ్య స్ఫూర్తికి మాత్రమే కట్టుబడతానని, అంతకు మించి ఎవరిపైనా ప్రత్యేక ప్రేమ చూపనని,  వాళ్లు చెప్పేది వాళ్లు చెప్పుకొంటారని, మీరు చేయాల్సింది మీరు చేయండని, ప్రభుత్వం ప్రభుత్వమే, రాజకీయం రాజకీయమే!’’ అని మోదీ సూటిగా చెప్పారు.

బీజేపీ నేతలతో సమావేశం తర్వాత మోదీ..పవన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తానని మోదీ చెప్పారని, ఏపీ పరిస్తితులని మోదీకి వివరించానని పవన్ చెప్పుకొచ్చారు. కానీ అసలు భేటీలో ఏం మాట్లాడుకున్నారో పూర్తిగా చెప్పలేదు. ఇక ఇప్పుడు మోదీతో జగన్ భేటీ కానున్నారు. జగన్ రాష్ట్రం కోసం మాట్లాడతారా? పోలిటికల్ అంశాలు మాట్లాడతారా అనేది క్లారిటీ లేదు. పైకి రాష్ట్రం గురించి చర్చమని వార్తలు వస్తాయి. ఏపీలో ఇలా ఉంటే తెలంగాణలో రాజకీయం మరోలా ఉంది.

అక్కడ అధికార టీఆర్ఎస్, మోదీ టూర్‌ని పట్టించుకోవడం లేదు. ఆల్రెడీ కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని తెలుస్తోంది. ఏదో ప్రోటోకాల్ ప్రకారం మంత్రి తలసాని, మోదీకి స్వాగతం పలుకుతారు. ఇక మోదీకి ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండుచోట్ల సభలు నిర్వహించనున్నారు. ఎయిర్ పోర్ట్ దగ్గరలో, తర్వాత రామగుండంలో ఓ సభ నిర్వహించనున్నారు. ఇక మోదీ..కేసీఆర్ టార్గెట్‌గా ఏమన్నా మాట్లాడతారా? రాజకీయ పరమైన అంశాలు ఏం వస్తాయనే ఆసక్తి ఉంది. మొత్తానికి రెండు రాష్ట్రాల్లో మోదీ టూర్‌లో ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news