ఆనందయ్య మందు ఇంకా దొంగతనంగా వెళ్తూనే ఉందా…?

నెల్లూరు జిల్లాలో ఆనందయ్య మందు వ్యవహారం ఇప్పుడు సంచలనం అయింది. ఈ మందు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని అందరూ కూడా తప్పు పడుతున్నారు. ఇప్పుడు హైకోర్ట్ లో కూడా దీనికి సంబంధించి కేసు విచారణ నడుస్తుంది. ఆనందయ్య కూడా దీనికి సంబంధించి పిటీషన్ దాఖలు చేసారు. ఇక ఇదిలా ఉంటే ఈ మందుని అధికార పార్టీ నేతలు అక్రమంగా తరలిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.

కృష్ణపట్నం గోపాలపురంలోని కేపీఎస్ఎస్పీఎల్ అకాడమీలోనే బొనిగి ఆనందయ్య ఉన్నారు. ఆనందయ్య చుట్టూ పోలీసు వలయం. ప్రతి రోజూ బక్కెట్ల కొద్ది మందు తయారు చేయించి మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకువేల్తున్నారు. ఆనందయ్యని వంట మాస్టారుగా చేశారని, జైల్లో ఖైదీకి ఇచ్చే స్వేచ్చ కూడా ఇవ్వడం లేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఆనందయ్య మందు పంపిణీ కోసం జనం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.