రోడ్డుపై పడిన బ్యాగ్.. దాన్ని తీసుకున్న హోంగార్డు అందులో ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి… చివరకు…

హైదరాబాద్: మొఘల్‌‌నగర్ చౌరస్తా పిల్లర్ నెంబర్ 104 వద్ద వాహనాలు ఫుల్ బిజీగా వెళ్తున్నాయి. అయితే ఓ ఆటోలో నుంచి రోడ్డుపై బ్యాగ్ పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు బ్యాగ్ పడిన విషయాన్ని చూసుకోలేదు. ఆటో అక్కడ నుంచి వెళ్లిపోయింది. అయితే బ్యాగ్ పడటాన్ని ట్రాఫిక్ హోంగార్డు గమనించారు. అంతే బ్యాగును తీసుకుని ఓపెన్ చేసి చూశాడు.

అందులో తులం విలువైన ఉంగరంతో పాటు రూ. 5 వేలు డబ్బులు, ఓ సెల్ ఫోన్ ఉంది. దాంతో బ్యాగు మహిళదని గుర్తించారు. వెంటనే ఫోన్ చేసి ఆమెకు సమాచారం అందించారు. దాంతో ఆమె వచ్చి హోంగార్డు నుంచి బ్యాగును తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు హెంగార్డును అభినందించారు. హోంగార్డు సేవను కొనియాడారు. ప్రజా సేవకు తెలంగాణ పోలీసులు ప్రతిక్షణం ముందుంటారని పోలీసులు తెలిపారు.