సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులు ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ దగ్గరికి చేరాయి. ఈ బిల్లులను కూడా ఆయన ఆమోదిస్తారా.. లేదా తిప్పి పంపిస్తారా అనే ఉత్కంఠత అందరిలో నెలకొంది.ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు అధికార పార్టీలు ప్రయత్నాలు కొనసాగించారు. తాజాగా సీఆర్డీఏ చట్టం రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ వద్దకు పంపించారు. బిల్లు ఆమోదిస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొని ఉంది.
ఈ బిల్లును ఆమోదించవద్దని, బిల్లును తిరస్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లేఖ రాశాడు. ఈ రెండు బిల్లులను శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపిందని, ఈ సమయంలో బిల్లును ఆమోదించడం కరెక్ట్ కాదన్నారు. అమరావతి రాజధానిని తరలించడం వల్ల రైతులు నష్ట పోతారని పేర్కొన్నారు. బిల్లు ఆమోదంపై ప్రజలు, రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. మూడు రాజధానుల అంశంపై బీజేపీ నాయకుల్లో భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. కన్నా లక్ష్మీ నారాయణ, సుజనా చౌదరితో పాటు కొందరు నాయకులు బిల్లును వ్యతిరేకించారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు, రాయలసీమకు చెందిన
నాయకులు బిల్లును స్వాగతించారు.