ఏపీనీ ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం బడ్జెట్ కేటాయించిందనీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024-25పై ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలో స్పందించిన ఆయన.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో ఊరట కలిగిస్తోందనీ తెలిపారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం కేటాయింపులు ఉన్నాయనీ అన్నారు.. పోలవరం రాష్ట్రానికి జీవనాడి లాంటిది.. పోలవరం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సీఎం చంద్రబాబు ప్రభుత్వం పోలవరంలో 2014-2019 నాటికి 75 శాతం పనులు పూర్తి చేసింది.కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం పోలవరాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. కేంద్రం సహాయం, సహకారంతో పోలవరం పూర్తిఅవుతుందన్న నమ్మకం కలుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇక వైఎస్ జగన్ రాజధానిని మూడు ముక్కలాటలు ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కళ్లలా… సీఎం చంద్రబాబు ముందుకు తీసుకువెళుతున్నారు అని ప్రశంసించారు. ఐదేళ్లలో రాష్ట్రం నష్టపోయింది.. ఇప్పుడు తిరిగి గాడిన పెడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నారు.