IND vs SL :ప్రాక్టీసు ప్రారంభించిన టీమిండియా.. వీడియో వైరల్

-

టీ20ల అంతర్జాతీయ సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక చేరుకున్న విషయం తెలిసిందే.సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా జూలై 22న శ్రీలంకకు చేరుకుంది.ఈ క్రమంలో.. ఈరోజు నుంచి టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లను ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. టీమిండియా కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కి ఇది మొదటి అసైన్‌మెంట్. అంతే కాకుండా.. టీ20 కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్కు కూడా ఇది మొదటి టూర్. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అందువల్ల సూర్యనే కెప్టెన్సీకి ఉత్తమ ఎంపికగా భావించారు.

ఇక టీ 20 సిరీస్ జూలై 27 నుంచి ప్రారంభమవుతుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో భారత్‌, శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. సిరీస్‌లో మొదటి టీ20 జూలై 27న ,రెండవ మ్యాచ్ జూలై 28,థర్డ్ మ్యాచ్ 30న జరుగుతాయి. టీ20 సిరీస్ అనంతరం ఆగస్టు 2,4,7 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరుగునున్నాయి.భారత కాలమానం ప్రకారం, టీ20లు రాత్రి 7:30 గంటలకు, వన్డేలు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version