త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను కేంద్రం నోటిఫై చేసింది. ఈ బిల్లు 2019 డిసెంబర్ లోనే పార్లమెంటు ఆమోదం పొందినా నిరసనల కారణంగా అమలవలేదు. ఎన్నికలకు ముందే దీన్ని అమలు చేస్తామని హోంమంత్రి అమిత్ షా ఇటీవలే వెల్లడించారు.ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడంపై వివాదం రాజకుంది.
1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ ప్రభుత్వం సవరణలు చేసి 2019లో చట్టంగా మార్చింది. అయితే పౌరసత్వం ఇచ్చేందుకు మతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి.దీంతో ఈ సిఏఏ వివాదాస్పదంగా మారింది. దీన్ని తాము అమలు చేయమని తమిళనాడు ,కేరళ రాష్ట్రాలు చెబుతున్నాయి.