ఏలూరుకు కేంద్ర వైద్య బృందాన్ని అత్యవసరంగా కేంద్రం ప్రభుత్వం పంపిస్తుంది. రేపు కేంద్ర బృందం ఏలూరు వస్తుంది. ప్రజలకు ఆకస్మిక అనారోగ్యంపై విచారణ చేయనున్న బృందం… వాస్తవ పరిస్థితిపై నివేదిక సిద్దం చేస్తుంది. బృందంలో డాక్టర్ జంషెడ్ నాయర్, అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ అవినాష్ డియోష్టవర్, వైరాలజిస్ట్, డాక్టర్ సంకేత్ కులకర్ణి ఉన్నారు. రేపు సాయంత్రం నాటికి ప్రాథమిక నివేదికను సమర్పించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.
ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (పిహెచ్ డివిజన్) నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏలూరుకు కేంద్ర వైద్య బృందం హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేసారు. ఎయిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జె. నాయర్, పూణె వైరాలజీ ల్యాబ్ వైరాలజిస్ట్ డాక్టర్ అవినాష్, ఎస్ సి డి సి డిఫ్యూటీ డైరెక్టర్ డాక్టర్ సంకేత్ కులకర్ణి సభ్యులుగా కేంద్ర బృందం వస్తుంది అని ఆయన చెప్పారు.