దక్షిణాది దెయ్యం కథలపై అక్షయ్‌ కుమార్ ఆసక్తి అందుకేనా

-

ఎప్పుడూ కలెక్షన్లు, రికార్డుల లెక్కల్లో ఉండే అక్షయ్‌ కుమార్‌, ఈ మధ్య దెయ్యాల వెంట పడుతున్నాడు. ముఖ్యంగా దక్షిణాది భూతాల గురించి ఎక్కువ స్టడీ చేస్తున్నాడు అక్షయ్. వీటిల్లో ఏదైనా దెయ్యం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే వెంటనే ముంబై పట్టుకెళ్తున్నాడు. మరి అక్కీకి దెయ్యాలు ఇంట్రెస్టింగ్‌గా అనిపించడమేంటి అంటారా..ఇప్పుడీ ఆంశం పై బాలీవుడ్ లోనూ ఆసక్తికర చర్చ నడుస్తుంది.

సోషల్ ఓరియెంటెడ్‌ మూవీస్‌తో మెసేజులు ఇస్తోన్న అక్షయ్‌ కుమార్ సడన్‌గా దెయ్యాల ప్రేమలో పడ్డాడు. సౌత్‌ సూపర్‌ హిట్ హారర్‌ స్టోరీస్‌ని హిందీలో తీస్తున్నాడు. తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా ఇక్కడ హిట్‌ అయిన దెయ్యాల కథలని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్.

అక్షయ్‌ కుమార్ రీసెంట్‌గానే దెయ్యం కథ ‘లక్ష్మీ’తో ఓటీటీలోకి వచ్చాడు. లారెన్స్‌ భూతాల సీరీస్‌ ‘కాంచన’ రీమేక్‌గా వచ్చిందీ సినిమా. హిందీలో కూడా ఈ మూవీని లారెన్సే డైరెక్ట్‌ చేశాడు. అయితే అక్షయ్‌ కుమార్‌ సొంత బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాకి ఫ్లాప్‌ టాక్ వచ్చింది.

అక్షయ్‌ కుమార్‌ నిర్మాణంలో మరో దెయ్యాల కథ వస్తోంది. తెలుగులో అనుష్క చేసిన హారర్‌ మూవీ ‘భాగమతి’ని హిందీలో ‘దుర్గామతి’గా రీమేక్‌ చేశాడు అక్షయ్. టీసీరీస్‌తో కలిసి అక్షయ్‌ నిర్మించిన ఈ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది. భూమి ఫడ్నేకర్ లీడ్‌ రోల్‌ ప్లే చేసింది. మరి ఈ దెయ్యం అయినా అక్షయ్‌ కుమార్‌కి పాజిటివ్‌ రెస్పాన్స్‌ తీసుకొస్తుందా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news