కేంద్రప్రభుత్వం అదిరిపోయే స్కీమ్.. వారికి నెలకు రూ.10వేలు.. పూర్తి వివరాలు..

-

మోదీ ప్రభుత్వం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తుంది.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి కోసం కొత్త కొత్త పథకాలను అందిస్తూ వస్తుంది..ఇప్పుడు మనం చెప్పుకోబోయే పథకం భార్యాభర్తలకు సంబందించినది.. నెలకు రూ.10వేలు బెనిఫిట్.. పొందుతారు. వివరాలు తెలుసుకోండి..

అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు, ముఖ్యంగా వృద్ధులకు ఆదాయ భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని 2015 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆ తర్వాత 2015 మే 9న కోల్‌కతాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. వీటితో పాటు మరో రెండు స్కీంలను కూడా ప్రారంభించారు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, ప్రధాన మంత్రి సరక్ష బీమా యోజన వంటి బీమా పథకాలను ప్రారంభించారు…

ఇకపోతే అటల్ పెన్షన్ యోజన కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలలో బాగా పాపులర్ అయింది.. ఈ స్కీమ్‌లో భార్యాభర్తలు ఇద్దరూ చేరొచ్చు. ఇద్దరికీ 60 ఏళ్ల వయసు నుంచి నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ వస్తుంది. అంటే భార్యాభర్తలు ఇద్దరూ ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ.10 వేల పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వయసు ఎంత తక్కువగా ఉన్నప్పుడు ఈ స్కీమ్‌లో చేరి, పొదుపు చేస్తే అంత ఎక్కువ లాభం వస్తుంది.. 18 ఏళ్లు ఉన్నప్పుడు చేరితే నెలకు రూ.42 నుంచి రూ.210 వరకు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొలది ఈ మొత్తం పెరుగుతూ ఉంటుంది. అటల్ పెన్షన్ స్కీమ్ కింద కనీసం 20 ఏళ్లు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది..

ఇలా రూ.5 వేలు పెంన్షన్ కోసం నెలకు రూ. 210 కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అదే త్రైమాసికంగా రూ. 626, అర్థవార్షికంగా రూ. 1,239 కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. నామినీకి ఏక మొత్తంలో రూ. 8.5 లక్షలు చెల్లిస్తారు. ఈ రకంగా భార్యాభర్తలకు రూ. 10 వేలు పెన్షన్ ను పొందుతారు.. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇన్వెస్ట్ చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news