అదిరిపోయే అప్డేట్ ‘బ్రో’.. మామాఅల్లుళ్ల లుక్ కేక

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ బ్రో నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. పవన్, సాయిధరమ్​ల లుక్​ను ఈ చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ పోస్టర్​లో మామాఅల్లుళ్లు సూపర్ హ్యాండ్సమ్​గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్​ లుక్ అదిరిపోయింది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జులై 28న రిలీజ్​కు రెడీ అవుతోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. పవర్ స్టార్ స్వాగ్ సూపర్​గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ మూవీలో ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్​గా నటిస్తోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు అందిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ కామెడీ-డ్రామాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా.

Read more RELATED
Recommended to you

Latest news