Ajwain leaf juice: వాము ఆకుల రసం వలన ఉపయోగాలు చూస్తే ఈరోజే మొదలు పెడతారు…!

-

వాము ఆకుల రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది చాలా మంది వాము ఆకుల రసాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే నిజానికి వాము ఆకుల రసం వల్ల కలిగే ఉపయోగాలు చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఎందుకంటే చాలా మందికి వాము ఆకుల వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి తెలియదు వాముని కూడా ఎక్కువ మంది వంటల్లో వాడుతూ ఉంటారు వాము వలన కూడా చాలా లాభాలు ఉన్నాయి. వాము ఆకులు లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు యాంటీ ఫంగల్ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ తో పాటుగా ప్రోటీన్ ఫ్యాట్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ వంటివి కూడా ఎక్కువగా ఉన్నాయి.

చర్మ ఆరోగ్యానికి, అజీర్తి సమస్యలకి, ఆర్థరైటిస్ నొప్పికి, ఒత్తిడి, యాంగ్జైటీ వంటి సమస్యలకి కూడా వాము ఆకులు బాగా పనిచేస్తాయి. దగ్గు జలుబు రెస్పిరేటరీ సమస్యలు కూడా దూరం అవుతాయి. ఆరోగ్య నిపుణులు ఈరోజు వాము ఆకుల రసం గురించి మనకి ఉపయోగాలు తెలిపారు ఇక మరి వాటి కోసం తెలుసుకుందాం..

దగ్గు, జలుబు సమస్యల కి..

దగ్గు జలుబు సమస్యలకి వాము ఆకులు బాగా పనిచేస్తాయి వాము ఆకుల రసం మీరు తీసుకోవచ్చు. కొన్ని ఆకులు తీసుకుని వాటిని కడిగేసి ఒక పాన్ లో నీళ్లు పోసి ఆకుల్ని వేసి మరిగించిన తర్వాత ఆ రసాన్ని తాగితే తలనొప్పి తగ్గుతుంది. అలానే జలుబు పోతుంది. గొంతు ఇన్ఫెక్షన్స్ వంటి ఇబ్బందులు కూడా ఉండవు. దగ్గు కూడా దూరం అయిపోతుంది.

జ్వరానికి…

జ్వరానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఒక మెడిసిన్ లాగ ఇది పనిచేస్తుంది. వాము ఆకుల రసాన్ని తీసుకుంటే జ్వరం పూర్తిగా తొలగిపోతుంది.

తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది..

వాము ఆకుల రసాన్ని తీసుకుంటే తల్లిపాలు పడతాయి ఇందులో ప్రోటీన్ విటమిన్ సి ఉంటాయి. పాలిచ్చే తల్లులు బ్రెస్ట్ మిల్క్ సప్లై ని పెంచుకోవడానికి వామాకుల రసాన్ని తీసుకోవచ్చు.

ఆర్థరైటిస్ నొప్పి..

ఈ సమస్యతో బాధపడే వాళ్ళు వామాకుల రసాన్ని తీసుకుంటే చాలా బాగా పని చేస్తుంది. ఇబ్బందిగా ఉన్న ప్రాంతంలో వామాకుల రసాన్ని అప్లై చేయచ్చు కూడా. రోగ నిరోధక శక్తిని కూడా వాము ఆకుల ద్వారా పెంచుకోవచ్చు ఈ రసాన్ని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇన్ఫెక్షన్స్ కూడా ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news