బిజెపిని ఒక ఆట ఆడుకున్న సిఎం

-

తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత మమతా బెనర్జీ బుధవారం బిజెపిపై విరుచుకుపడ్డారు. బిజెపి నేతలు అల్లర్లను ప్రేరేపించారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్‌లో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రసంగించిన సిఎం మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీ అల్లర్లను ప్రేరేపించే నేతలతో నిండి ఉందని ఆరోపణలు చేసారు. ర్యాలీలో మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేసారు.

టిఎంసిలో అవినీతిపరులకు చోటు లేదని అన్నారు. అత్యాశ ఉన్నవారు వెళ్ళిపోయారు అని ఆమె వ్యాఖ్యానించారు. టిఎంసిలో అలాంటి అత్యాశ వ్యక్తులకు చోటు లేదు అని స్పష్టం చేసారు. మా పార్టీ టిక్కెట్లు అమ్మకానికి లేవు అని అన్నారు. ప్రజలతో ఉన్న వారికి స్వయంచాలకంగా టికెట్లు లభిస్తాయి అని వివరించారు. మా నాయకులు మా బూత్ కార్యకర్తలకే టికెట్ లు వస్తాయని అన్నారు.

టిఎంసిలో అవినీతిపరులకు చోటు లేదని, అధికార పార్టీని వీడాలని కోరుకునే వారు వెంటనే వెళ్ళిపోవాలని ఆమె సూచనలు చేసారు. టిఎంసిని విడిచిపెట్టిన వారు ఎన్నికలలో గెలవరు అని ధీమా వ్యక్తం చేసారు. బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల తరువాత వారి దుకాణాలు మూసివేయబడతాయి అని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌పై 2021 ప్రతిపాదనను దృష్టిలో పెట్టుకుని మమతా బెనర్జీ మాట్లాడుతూ ఎల్‌ఐసిలో 74 శాతం కూడా ఇప్పుడు అమ్ముడవుతోంది. వారు ప్రతిదీ అమ్ముతున్నారు అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news