దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. బడ్జెట్ లో పెట్టుబడి వ్యయం తగ్గింపు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ లో పెట్టుబడి వ్యయం తగ్గించాలన్న రాష్ట్రా ప్రభుత్వాల ఒత్తిడికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింంది. బడ్జెట్ లో పెట్టుబడి వ్యయం 20 శాతం ఉండాలన్న నిబంధనను సవరించింది కేంద్ర ప్రభుత్వం.
పెట్టుబడి వ్యయాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది కేంద్రం. కరోనా మహమ్మారి కారణంగా పెట్టుబడి వ్యయం తగ్గించాలని కేంద్రాన్ని కోరాయి పలు రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యం లోనే రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కేంద్రం నిర్ణయంతో ఈ ఆర్ధిక సంవత్సరం ఏపి పెట్టుబడి వ్యయం రూ. 26,262 కోట్లుకు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. 15 శాతం పెట్టుబడి వ్యయం ఖర్చు చేస్తే.. అదనంగా 0.5 శాతం అప్పు చేసుకునే వెసులు బాటు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.