ప్రస్తుతం అన్నిరకాల బ్యాంకులు తమ కస్టమర్లకు డెబిట్ క్రెడిట్ కార్డుల సదుపాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. వివిధ రకాల కార్యకలాపాలు జరుపుకునేందుకు ఎన్నో సర్వీసులను కూడా తమ కస్టమర్లకు అందుబాటులోకి ఉంచాయి వివిధ బ్యాంకులు. రేపటి నుంచి డెబిట్ క్రెడిట్ కార్డు వినియోగదారులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30 తర్వాత డెబిట్ క్రెడిట్ కార్డుల సేవలు నిలిచిపోనున్నాయి.
సెప్టెంబర్ 30 తర్వాత డెబిట్ క్రెడిట్ కార్డ్ పై ఇంటర్నేషనల్ ఆన్లైన్ కాంటాక్ట్ ట్రాన్సాక్షన్ లెస్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. డెబిట్ క్రెడిట్ కార్డ్ సేవలను పునరుద్ధరించుకునేందుకు ఆన్లైన్ యాప్, ఏటీఎం సెంటర్, లేదా సమీప బ్రాంచ్ కి వెళ్లి ఈ సేవలను పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుంది. రిక్వెస్ట్ చేసిన అనంతరం 24 గంటలు ఈ సేవలు మళ్లీ పునరుద్ధరించబడతాయి. అందుకే ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఆగిపోతే కంగారు పడకుండా వెంటనే బ్యాంకు కి వెళ్లి రిక్వెస్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.