రాజకీయ అజ్ఞాతవాసం గడుపుతున్న తన కుమార్తె కవిత కోసం కెసిఆర్ గట్టిగానే కష్టపడుతున్నారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత, కవిత పార్టీలో యాక్టివ్ గా ఉండడం లేదు. ఏ ఎన్నికల ప్రచారం లోనూ ఎక్కడా ఆమె కనిపించలేదు. రాజకీయాలపై ఆసక్తి లేనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. అయితే జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్న కేసీఆర్ తెలంగాణలో కేటీఆర్, కవిత కు ప్రాధాన్యం గురించి తాను జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత టిఆర్ఎస్ తరఫున నామినేషన్ వేయించారు. ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, కవిత గెలుపు కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ టిఆర్ఎస్ కు భారీ స్థాయిలో స్థానిక సంస్థల ఓటర్లు ఉన్నా, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వంటివారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత ను ఓడించే అంశంపై దృష్టి పెట్టడం, దానికి అనుగుణంగా పావులు కదుపుతున్న చర్యలతో కేసీఆర్ కాస్త కంగారు పడుతున్నారు.
కవిత విజయానికి ఎటువంటి డోకా లేకుండా చేసేందుకుగాను ఆపరేషన్ ఆకర్ష కు తెరతీశారు. బిజెపి-కాంగ్రెస్ మిగతా పార్టీలకు చెందిన వారిని పెద్దఎత్తున పార్టీలోకి చేర్చుకోవాలని, మరింత బలం పెంచుకోవాలనే విధంగా కెసిఆర్ ముందుకు వెళ్తున్నారు. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, అందులో మూడు వంతుల మంది టిఆర్ఎస్ కు చెందిన వారే. అయినా ఇప్పుడు ఆపరేషన్ ఆదర్శ కు కేసీఆర్ తెరతీశారు. ఇప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్ లో ఆరుగురు బీజేపీ కార్పొరేటర్లు ,ఒక కాంగ్రెస్ కార్పొరేటర్ టీఆర్ఎస్ లో చేరగా , మరికొంతమంది చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ అక్టోబర్ 9 ప్రకటించడంతో, వీలైనంత మంది ఎక్కువ మంది బీజేపీ కాంగ్రెస్ కు చెందిన స్థానిక సంస్థల ఓటర్లను తీర్చుకునే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారు. ఇప్పటికే మండలాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించి, పార్టీ నాయకులు ఎవరూ, ఇతర పార్టీల వైపు వెళ్ళకుండా చూడడంతో పాటు, ఇతర పార్టీల నుంచి చేరికలు ఈ విధంగా కెసిఆర్ ప్లాన్ చేశారు. కవిత ఎమ్మెల్సీగా గెలవగానే మంత్రిగా ఆమెకు కెసిఆర్ అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్లు కూడా, తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
-Surya