ఎంఐ స్మార్ట్ ఎల్ఈడీ బ‌ల్బ్‌ను లాంచ్ చేసిన షియోమీ.. ధ‌ర ఎంతంటే..?

-

మొబైల్స్ త‌యారీదారు షియోమీ కొత్త‌గా ఎంఐ స్మార్ట్ ఎల్ఈడీ బ‌ల్బ్ (వైట్)ను భార‌త్‌లో మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. ఇది 7.5 వాట్ల సామ‌ర్థ్యం క‌లిగి ఉంది. 810 ల్యూమెన్స్ బ్రైట్ నెస్‌ను ఇస్తుంది. ఇందులో అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌ల‌కు స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. దీనికి ప్ర‌త్యేకంగా సాకెట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల దీన్ని సుల‌భంగా ఇండ్ల‌లో అమ‌ర్చుకోవ‌చ్చు. కేవ‌లం తెలుపు రంగులో మాత్ర‌మే బ‌ల్బు వెలుగుతుంది.

mi smart led bulb launched in india

ఈ స్మార్ట్ ఎల్ఈడీ బ‌ల్బ్‌ను ఎంఐ హోమ్ యాప్‌కు క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. దీంతో బ‌ల్బ్‌ను ఫోన్ ద్వారానే స్విచ్ ఆన్‌, స్విచ్ ఆఫ్ చేయ‌వ‌చ్చు. నిర్ణీత టైముకు బ‌ల్బ్ ఆన్ లేదా ఆఫ్ అయ్యేలా ఇందులో సెట్ చేసుకోవ‌చ్చు. బ్రైట్‌నెస్‌ను అడ్జ‌స్ట్ చేసుకోవ‌చ్చు.

ఈ బ‌ల్బ్‌ను వైఫైకి ఎంఐ హోం యాప్ ద్వారా క‌నెక్ట్ చేయ‌వ‌చ్చు. నిత్యం 6 గంట‌ల పాటు ఈ బ‌ల్బ్‌ను వాడితే ఏకంగా 7 ఏళ్ల పాటు లేదా 15వేల గంట‌ల వ‌ర‌కు ఈ బ‌ల్బ్ ప‌నిచేస్తుంద‌ని కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు. దీన్ని రూ.499 ధ‌ర‌కు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news