‘ ది ఢిల్లీ ఫైల్స్’ లో తమిళనాడు గురించి కూడా చాలా నిజాలు చెబుతాం: వివేక్ అగ్నిహోత్రి

-

‘ ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీతో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. తన తదుపరి సినిమా ‘ ది ఢిల్లీ ఫైల్స్’ అంటూ స్పష్టం చేశాడు. 1990లో కాశ్మీర్ లో హిందువులు, ముఖ్యంగా కాశ్మీరీ పండిట్లపై సాగించిన అఘాయిత్యాలు, హింసపై కాశ్మీర్ ఫైల్స్ సినిమాను తీశారు. తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఏకంగా ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలు సినిమాపై ప్రశంసలు కురిపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ కూడా ప్రకటించాయి. 

ఇదిలా ఉంటే తన తాజా సినిమా ‘ ది ఢిల్లీ ఫైల్స్’ అంటూ ప్రకటించారు వివేక్ అగ్నిహోత్రి. ఢిల్లీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తారనే సమాచారం ఉంది. అయితే సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు వివేక్ అగ్నిహోత్రి. ఈసినిమా ఢిల్లీ గురించే కాకుండా తమిళనాడు గురించి కూడా చాలా నిజాలు చెబుతుందని వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా ఢిల్లీ… భారత్ ను ఎలా నాశనం చేస్తుందో చూపిస్తామని అన్నారు. చాలా మంది అమాయకులను చంపారని…దానిని కప్పిపుచ్చారని.. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా..? అంటూ కాంగ్రెస్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ప్రజలకు వాస్తవాలు చెబతా అంటూ వివేక్ అగ్నిహోత్రి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news