కరోనా వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి..ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ప్రకటించాయి.. అయితే నేర్పవచ్చు కానీ మాన్పలేము అనే సామెత మీ అందరికీ తెలిసే ఉంటుంది. వర్క్. ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులు ఆఫీసులు రమ్మంటే ససేమీరా అంటున్నారు.. అవసరమైతే వేరే కంపెనీకైనా మారేందుకు సై అంటున్నారు. ఐటీ కంపెనీలకు ఇప్పుడు పెద్ద సమస్యే వచ్చింది.
ఆఫీసులకు రావాలని యాజమాన్యాలు పంపిన మెయిల్స్‌కు ఉద్యోగులు ఊహించని విధంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టాఫింగ్ సర్వీసెస్ సంస్థ (CIEL HR) జరిపిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే ప్రకారం.. దాదాపు 88 శాతం మంది ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని ఒత్తిడి చేస్తే రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 46 శాతం మంది ప్రస్తుతం వాళ్లు చేస్తున్న ఉద్యోగాల్ని పక్కనపెట్టి .. వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉన్న ఉద్యోగాల కోసం అన‍్వేషిస్తున్నారట. కాగా, వీరిలో ఎక్కువ శాతం వర్కింగ్ మదర్స్ ఉండటం విశేషం..
తాజాగా మూన్‌లైటింగ్ చేస్తున్నారని విప్రో ఏకంగా 300 మంది ఉద్యోగులు తీసేసింది. ఈ విషయం చాలా కంపెనీలకు గుబులు పుట్టేచిదాలానే ఉంది. తమ కంపెనీలో ఎంతమంది ఇలా చేస్తున్నారో అనే అనుమానం ఇప్పుడు అన్నీ ఐటీ కంపెనీలకు పట్టుకుంది. కచ్చితంగా ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కంపెనీలు పట్టుబట్టాయి. హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ వంటి అగ్రశ్రేణి ఐటి సంస్థలు సైతం వారానికి కనీసం మూడు రోజులు ఉద్యోగులను కార్యాలయానికి పిలుస్తున్నాయి. ఇన్ఫోసిస్ కూడా ఇదే బాటలో నడుస్తోంది.
అయితే వారానికి మూడు రోజులు ఆఫీస్..మిగతా రెండు రోజులు వర్క్‌ఫ్రమ్ అనే కాన్సప్ట్ యాజమాన్యానికి బాగుందేమో కానీ.. ఉద్యోగులకు అస్సలు ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఒక్కసారి ఆఫీస్‌కు వెళ్లామంటే..ఆ సిటీలో బ్యాచిలర్స్ అయితే రూమ్ తీసుకోవాలి. దానికి తోడు వగైరా ఖర్చులు ఉంటాయి.. మీరు ఇక రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి ఏం లాభం అనేది ఉద్యోగుల ప్రశ్న..! ఇంతకీ మీరు దేనికి రెడీగా ఉన్నారు.?