టాలీవుడ్ కింగ్ నాగార్జున మన్మథుడు 2 సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. నాగార్జున – రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు నటుడు రాహుల్ రవీంద్రన్ (సింగర్ చిన్మయి భర్త) దర్శకత్వం వహించారు. 2002లో మన్మథుడు సినిమాతో కెరీర్‌లోనే తిరుగులేని రొమాంటిక్ హీరో ముద్ర వేయించుకున్న నాగార్జున ఇప్పుడు ఈ ఆరు పదుల వయస్సులో కూడా మళ్లీ అదే తరహా ఫార్మాట్ కథతో వస్తుండడంతో పాటు టీజర్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
సరిగ్గా మూడు నాలుగు రోజులు సెలవు దినాల్ని లెక్కలేసి టైమ్ చూసి మన్మధుడిని థియేటర్లలోకి వదులుతున్నారు. శుక్రవారం శ్రావణ శుక్రవారం, రెండో శనివారం, ఆదివారం ఇలా వరుసగా సెలవులు వచ్చాయి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 20 కోట్ల షేర్ మార్క్ టచ్ చేస్తే చాలు సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయినట్టే. ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా రూ.18 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు.
నైజాంలో 5.5 కోట్లు – సీడెడ్ 2.5 కోట్లు – ఆంధ్రా 7 కోట్లు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 16.5 కోట్లు, ఓవర్సీస్లో 1.75 కోట్లు బిజినెస్ చేసింది. నాగార్జున మార్కెట్ తక్కువుగా ఉండడంతో తక్కువ రేట్లకే అమ్మారు. ఇక నాలుగు వరుస సెలవులతో పాటు ఆగస్టు 15 సెలవులు అన్ని కలుపుకుంటే సినిమాకు టాక్ బాగుంటే భారీ లాభాలు రానున్నాయి.
ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ పరిశీలిస్తే డిజిటల్ రైట్స్ నెట్‌క్లిప్స్‌కు 7.4 కోట్లకు, హిందీ డబ్బింగ్ రూ.6 కోట్లకు వెళ్లాయి. కర్నాటక- బెంగళూరు బెటర్ ప్రైజ్ కి అమ్మారట. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మనం ఎంటర్ ప్రైజెస్- ఆనంది ఆర్ట్స్- వయకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మరి నాగ్ ఈ సింపుల్ టార్గెట్‌ను ఎలా ? రీచ్ అవుతాడో ? చూడాలి.