డిసెంబర్ నుంచి నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే..?

-

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ 2,91,159 కోట్ల రూపాయలతో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్  ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన మహాకవి దాశరథిని గుర్తు చేసుకుంటూ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఆర్థిక క్రమశిక్షణతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదలైందన్నారు భట్టి విక్రమార్క. ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నామన్నారు.

6.70 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చాయి. ఈ అప్పులపై రూ. 48 వేల కోట్ల వడ్డీ చెల్లించామన్నారు. అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.  డిసెంబర్ నుండి ఇప్పటి వరకు 34,579 కోట్ల రూపాయలు వివిధ పథకాలపై ఖర్చు చేశామని తెలిపారు. వాస్తవానికి దగ్గరగా గత ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టామన్న ఆర్థిక మంత్రి భట్టి, గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో నిర్లక్ష్యం చేసిందన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను అస్సలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news