ఏపుగా కాసిన టమాట పంటకు నిప్పుపెట్టిన రైతు.. ఎందుకంటే?

-

రాష్ట్రంలో మొన్నటివరకు చుక్కలు చూపించిన టమాట ధర ఒక్కసారిగా పడిపోయింది. గత రెండు నెలల కిందట కేజీ టమాట రూ.100 పలికింది. దీంతో అన్నదాతలు తమ కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఎంతో సంతోషించారు. అందుకే చాలా మంది టమాట పంటను సాగుచేశారు. దిగుబడి కూడా ఈసారి బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఒక్కసారిగా టమాట మద్దతు ధర పడిపోయింది.

మార్కెట్లో కేజీ రూ.5 (హోల్ సేల్) ధర పలుకుతుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెదక్ జిల్లా శివంపేట మండలం నవాబ్ పేటకు చెందిన రైతు తన పొలంలో పండించిన టమాట పంటకు నిప్పు పెట్టాడు.టమాటసాగులో నష్టాలు రావడంతోనే నిప్పంటించినట్లు తెలిపాడు. ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని పలువురు టమాట రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version