సమాజంలో రోజు రోజుకు మానవ సంబంధాలు మంటకలిసి పోతున్నాయి.. మనుషుల్లో నశిస్తున్న మానవత్వం వల్ల కన్నుమిన్ను కానక ఆడవారి పట్ల మృగాళ్ల మారుతున్నారు మగాళ్లు.. చివరికి కన్న కూతురైనా సరే కామంతో బుసలు కొడుతూ భూజాలపై మోసిన చేతులతోనే పడక సుఖాన్ని అనుభవిస్తున్నారు.. ఇలాంటి వారు ఈ భూమికే బరువుగా మారుతున్నారు.. కన్న వారి బ్రతుకులో మచ్చగా మిగులుతున్నారు..
ఇకపోతే ఓ దుర్మార్గపు తండ్రి. వికలాంగురాలైన కూతురిపై అత్యాచారం చేసిన ఘటన త్రిపురలోని లాల్చెరా గ్రామంలో మంగళవారం 9 వ తారీఖు చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.. ఆ వివరాలు చూస్తే తాగుడుకు బానిసగా మారిన లాల్చెరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భార్య ఇంట్లో లేని సమయంలో మద్యం మత్తులో విచక్షణ మరచి కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాదు ఆ పాప ఎంతలా వేడుకున్నా ఆ దుర్మార్గుడు వదల్లేదు సరికదా కొట్టి చిత్ర హింసలు పెట్టి మరీ అత్యాచారం చేశాడట..
ఇక బయటకు వెళ్లిన తల్లి ఇంటికి తిరిగి రాగా.. అమాయకురాలైన ఆ బాలిక ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పగా, ఆగ్రహించిన ఆ తల్లి వెంటనే బాధితురాలిని వెంటబెట్టుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన బిడ్డ పరిస్థితిని వివరించగా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారట..