ఏపీలో ఇప్పుడు అరెస్ట్‌ల కాలం నడుస్తోందని అనుకుంటున్నారట.. ఇక ఈ మధ్యకాలంలో టీడీపీలోని కీలక నేతల అరెస్టుల పర్వం కొనసాగుతుంది.. ఇదివరకే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో నేతను టార్గెట్ చేసింది అనే టాక్ నడుస్తుందట.. అంతే కాకుండా ఇప్పటికే జేసీతోపాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించగా, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. ఇదేగాక మాజీమంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇలాంటి నేపధ్యంలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను టార్గెట్ చేసిందనే గుసగుసలు అక్కడి నాయకుల్లో బలంగా వినిపిస్తున్నాయట.
ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో అరెస్ట్‌కూ రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియా ఉదంతంలో ఆయన పాత్ర ఉందన్న ఆధారాలు ప్రభుత్వానికి లభించడం వల్ల నెక్ట్స్ అరెస్ట్ గంటాదే అన్న ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఇదివరకే సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ… ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తున్నారనే ఆరోపణల నేపధ్యంలో నలంద కిశోర్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది. నలంద కిశోర్.. గంటా శ్రీనివాసరావుకు అనుంగు అనుచరుడు. మంచి మిత్రుడు.. మొత్తానికి గత టీడీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై వైసీపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందనేది సృష్టంగా తెలుస్తుందంటున్నారు..