ఈఎస్‌ఐ స్కామ్ లో పాలుపంచుకున్నాడనే అభియోగాలతో అరెస్ట్ అయ్యాడు టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. తన ఆరోగ్య పరిస్తితి క్షీణించడంతో అధికారులు ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. గుంటూరు లోని జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చేన్నాయుడి విషయంలో నిన్న రాత్రి హైడ్రామా నెలకొంది. అచ్చెన్నాయుడిని బలవంతంగా డిశ్చార్జ్ చేసే ప్రయత్నాలు డాక్టర్లు చేస్తున్నారనె వార్తకి ప్రాదాన్యత సంతరించుకుంది. అచ్చేన్నాయుడి తరఫు లాయర్ కు ఈ సమాచారం దక్కటంతో ఆయన ఈ విషయాన్ని మిడిఒయాతో పంచుకున్నారు. రాత్రి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేసి అక్కడనుండి తరలించేందుకు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, ఇతర పోలీసు అధికారులతో కలిసి జీజీహెచ్ ఆసుపత్రికి వెళ్లారని ఆయన పేర్కొన్నారు.
గత రాత్రి జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ ఉదయం కూడా గుంటూరు జీజీహెచ్ వద్ద హై డ్రామా నెలకొంది. అచ్చెన్నాయుడిని తామేమీ డిశ్చార్జ్ చేయడం లేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఇక ఈ విషయం పై స్పందించిన కోర్టు నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన్ను అవినీతి నిరోధక శాఖ అధికారుల కస్టడీకి ఇస్తూ, విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఓ డాక్టర్, ఆయన న్యాయవాది సమక్షంలో అధికారులు ఆయన్ను ప్రశ్నించవచ్చని, అచ్చెన్నాయుడు మంచంపైనే ఉండి సమాధానాలు ఇవ్వవచ్చని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాల్సిందిగా అచ్చేన్నాయుడు కోర్టును విజ్ఞప్తి చేస్తే కోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది.