భారత్ లో కలకలం.. 5 లక్షలకి చేరువలో కరోనా కేసులు..!

-

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. అధికారులు ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. అయినా దీని తీవ్రత మాత్రం తగ్గట్లేదు.

తాజాగా, ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 16,922 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిందని, అలాగే మరో 418 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,73,105కు చేరుకుంది. ఇప్పటి వరకు కరోనాతో 14,894 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 1,86,514 మంది చికిత్స పొందుతుండగా కరోనాతో కోలుకొని 2,71,696 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news