బిగ్ బాస్ బ్యూటీ హార్రర్ సినిమా.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది..!

-

బిగ్ బాస్ షో ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించి ఆ తర్వాత ఎన్నో సినిమా అవకాశాలు అందుకున్న సెలబ్రిటీలు ఎంతోమంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి వారిలో ఒకరు హిమజ. బిగ్బాస్ తెలుగు సీజన్ 3 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన హిమజ తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో దగ్గర అయ్యింది. అంతకు ముందు ఎన్నో సినిమాల్లో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించిన హిమజా పలు ధారావాహికలో కూడా నటించింది. కానీ బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది

అయితే ఇటీవలే బిగ్ బాస్ లో తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరైన హిమజా ప్రస్తుతం ఓ హారర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హిమజా ప్రధాన పాత్రలు ‘జ’ అనే సినిమా తెరకెక్కుతుంది. జై దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించబడుతుంది సినిమా. హిమజ పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా సైదిరెడ్డి ఈ సినిమాను రూపొందిస్తుండగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version